ఫైనల్ టచ్ ఇవ్వబోతున్న బాలకృష్ణ !


నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘పైసా వసూల్’. బాలకృష్ణ తన రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా పూర్తి స్థాయి కమర్షియల్ ఫార్మాట్లో చేస్తున్న ఈ సినిమా పట్ల మంచి అంచనాలున్నాయి. అందుకే పూరి కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాను అభిమానులు మెచ్చే విధంగా రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇకపోతే ఇటీవలే పొర్చుగల్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ను హైదరాబాద్లో ప్రారంభించనుంది.

జూలై 3వ తేదీ నుండి మొదలుకానున్నఈ లాంగ్ షెడ్యూల్ జూలై 28 వరకు నిర్విరామంగా సాగనుంది. ఈ షెడ్యూల్ తర్వాత వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టి ముందుగా చెప్పినట్టే సినిమాను సెప్టెంబర్ 29న రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోంది. ఇకపోతే అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రియ శరన్ హీరోయిన్ గా నటిస్తుండగా ముస్కాన్ కీలక పాత్రలో నటిస్తోంది.