పోటీపడబోతున్న రామ్ చరణ్, బాలయ్య !

Balakrishna RAmcharan

రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా భారీ విజయం సాధించడంతో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు చరణ్. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చరణ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. బోయపాటి హిట్ ట్రాక్, రామ్ చరణ్ రంగస్థలం ఎఫెక్ట్ ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నా, మేకర్స్ కి మాత్రం సినిమా విడుదలపై ఫుల్ క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

కానీ సంక్రాంతి హీరోగా తిరుగులేని రికార్డ్ ఉన్న బాలయ్య బాబు చిత్రం కూడా సంక్రాంతికే విడుదలవ్వనుంది. బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తన తండ్రి నందమూరి తారకరామారావు గారి బయోపిక్ చిత్రాన్ని బాలయ్య జనవరి 9న విడుదల చేయబోతున్నారు. అంటే ఈసారి సంక్రాంతికి బాలయ్య, రామ్ చరణ్ మధ్య భారీ పోటీ తప్పేలా లేదు.

Exit mobile version