‘బాలయ్య – అనిల్ రావిపూడి’ సినిమా కథాంశం ఇదే !

‘బాలయ్య – అనిల్ రావిపూడి’ సినిమా కథాంశం ఇదే !

Published on May 9, 2022 1:00 PM IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే, ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కథ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ముప్పై ఏళ్ల వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 ఏళ్లు శిక్ష పడుతుందట. జైలు నుంచి విడుదలైన హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు చాలా కామెడీగా సాగుతాయని.. సినిమాలో లవ్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ప్లాష్ బ్యాక్ చాలా వైల్డ్ గా ఉంటుందట.

ఇక ఈ సినిమా మల్టీస్టారర్ అని, సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడని.. ఆ హీరో రవితేజ అని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఇప్పటికే రవితేజతో ఒక సినిమా చేశాడు. ఇప్పుడు బాలయ్యతో రవితేజను కలిపి మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మరి.. బాలయ్య – రవితేజ కాంబినేషన్ అదిరిపోతోంది. అందుకే ఈ కలయికను సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడు అనిల్. అయితే, ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో కామెడీ డోస్ బాగా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు