రాజశేఖర్ పై బాలయ్య ప్రసంశల జల్లులు

18th, October 2017 - 11:00:31 AM


డా. రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18 ఎమ్‌’. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్ర‌ద్ధా దాస్‌, పూజా కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. స‌న్నీ లియోన్ ప్ర‌త్యేక గీతంలో సంద‌డి చేయ‌నుంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ సినిమా టీజ‌ర్‌కి మంచి స్పంద‌న ల‌భించింది. కాగా, ఈ చిత్ర ట్రైల‌ర్‌ని న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ…

రాజశేఖర్ వెనకున్న అదృశ్య శక్తి జీవిత, ఆయన విలక్షణ నటుడు, విభిన్న కథలు, విభిన్న పాత్రలతో తనదైన శైలిలో నటించి, ప్రేక్షకులను మెప్పించాడు, ఆయన ఎంచుకునే కథలు పాత్రలే కాదు, నటన కూడా విభిన్నంగా ఉంటుదని, గరుడవేగా ట్రైలర్ బాగుందని ప్రసంశలు కురిపించారు. వచ్చే నెల 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.