అన్‌స్టాపబుల్: ఒక్కో ఎపిసోడ్‌కి బాలయ్య అంత తీసుకున్నాడా?

Published on Jan 27, 2022 2:00 am IST

నందమూరి బాలకృష్ణ ఆహాలో వచ్చే “అన్‌స్టాపబుల్” టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్లతో బాలయ్య చేస్తున్న సందడి ప్రేక్షకులకు ఫుల్ టూ ఎంటర్‌టైన్‌ని ఇస్తుండడంతో ఆ షో టాప్ రేటింగ్‌తో దూసుకుపోయింది. ఫిబ్రవరి 4న జరగబోయే మహేశ్ ఎపిసోడ్‌తో మొదటి సీజన్ పూర్తి కాబోతుంది. తవ్రలోనే బాలయ్య రెండో సీజన్‌కి కూడా రెడీ అవుతున్నాడు.

అయితే సెకండ్ సీజన్‌కి బాలయ్య మరింత ఎక్కువగా రెమ్యూనరేషన్ పెంచేశాడని టాక్ వినిపిస్తుంది. అయితే మొదటి సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు గాను బాలయ్య నలభై లక్షల వరకు తీసుకున్నాడని, ఆ లెక్కన మొదటి సీజన్‌ మొత్తం కలిపి దాదాపు ఐదు కోట్ల వరకు తీసుకున్నాడని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :