
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం నూతన దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఇది బాలయ్య 98వ సినిమా. ఇప్పటి నుండే బాలయ్య 100వ సినిమాపై మీడియాలో అనేక వార్తలు షికార్లు చేస్తున్నాయి. ‘సింహ’, ‘లెజెండ్’ సినిమాలతో బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను 100వ సినిమాకు దర్శకత్వం వహిస్తారని ఒకరంటే… రాజమౌళి దర్శకుడిగా కన్ఫర్మ్ అని మరొకరు వార్తలను ప్రసారం చేస్తున్నారు. వీటిపై బాలకృష్ణ స్పందించారు.
100వ సినిమా గురించి ఇంకా ఏమి ఆలోచించలేదు, అభిమానుల అంచనాలు భారి ఎత్తున ఉన్నాయని తెలుసు. ఇప్పటివరకు ఏ దర్శకుడిని నాతో సినిమా చేయమని అడగలేదు. దర్శకులే నా కోసం కథలు రాసుకుని వచ్చారు. 100వ సినిమాకు దర్శకుడు ఎవరు..? అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేదు. అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.