టాక్..బాలయ్య లైనప్ లోకి మరో క్రేజీ డైరెక్టర్.?

టాక్..బాలయ్య లైనప్ లోకి మరో క్రేజీ డైరెక్టర్.?

Published on Nov 11, 2022 11:06 PM IST

ప్రస్తుతం నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వీర సింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అయితే ఇప్పుడు శరవేగంగా తెరకెక్కుతుండగా బాలయ్య ఇప్పుడు తన లైనప్ ని కూడా ఓ రేంజ్ లో రెడీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ బాలయ్య అయితే దర్శకుడు అనిల్ రావిపూడితో బాలయ్య ఓ ఇంట్రెస్టింగ్ సినిమా ప్లాన్ చెయ్యగా.

ఈ నెక్స్ట్ కూడా మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యినట్టుగా ఇపుడు తెలుస్తుంది. మరి లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే యంగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో బాలయ్య వర్క్ చేసే ఛాన్స్ చాలా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఓ ప్రముఖ బ్యానర్ లోనే ఈ ఇద్దరి కాంబోలో సినిమా పాజిబుల్ కానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అయితే మరిన్ని డీటెయిల్స్ మున్ముందు రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు