బోయపాటి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య !

Published on May 29, 2022 10:05 pm IST

బాలయ్య బాబు ‘అఖండ’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. పక్కా మాస్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమా అటు యూఎస్ లో సైతం భారీ వసూళ్లను సాధించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లు బోసిపోయాయి. ఆ సమయంలో మళ్ళీ థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన ఘనత ఒక్క బాలయ్య ‘అఖండ’కే దక్కింది. కాగా తాజాగా ఈ సినిమా 175 రోజుల వేడుక జరిగింది.

ఈ వేడుకలో బాలయ్య కేక్‌ ను కట్ చేసి.. ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్లు, డైరెక్టర్, ఫ్యాన్స్‌కు షీల్డులు అందజేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ‘అఖండ’ చిత్రాన్ని తన తండ్రి నందమూరి తారక రామారావుకు అంకిత చేస్తున్నట్లు చెప్పారు. ఇక బాలయ్య బోయపాటి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బోయపాటి శ్రీను అంటే.. తనకు ఎంతో నమ్మకమని.. అతను ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తాడని బాలయ్య తెలిపారు.

సంబంధిత సమాచారం :