తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి సహకరించాలి – బాలకృష్ణ

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి సహకరించాలి – బాలకృష్ణ

Published on Nov 28, 2021 1:12 AM IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలోనే నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ మా సినిమ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విచ్చేసిన ఐకాన్ హీరో, చాక్లెట్ బాయ్.. తమ్ముడు అల్లు అర్జున్‌కు థాంక్స్ అని, ఆహా‌లో టాక్ షో చేస్తున్నాను. మాకు, అల్లు కుటుంబంతో బంధం గురించి అప్పుడే చెప్పాను. బాబుకు నా ఆశీస్సులు. ప్రపంచం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి.. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు ఆయనకు నా కృతజ్ఞతలు అని అన్నారు. ఇక నలుమూలల నుంచి విచ్చేసిన అభిమానులకు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు, ప్రోడ్యూసర్లకు, మీడియాకు అందరికి థాంక్స్. ఇది ఏ ఒక్కరి సినిమా అని అనుకోవడం లేదు. అందరికి శివ పార్వతుల ఆశీస్సులు ఉండాలి. మనం పలికే అక్షరంలో ఉండే బలం.. ఒక్కో అక్షరం కలిపితే మంత్రం అవుతుంది. ఆహాలో చేసినట్టుగానే.. ఓ భక్తి చానల్‌ కూడా మొదలుపెడదామని అనుకుంటున్నాం. వినుట, స్మరించుట, సేవించుట, కీర్తించుట, పూజించుట, నమస్కరించుట, పరిచరియాలు చేయూట, స్నేహ భావంతో ఉండుట, మనో వాక్కాయాలను భగవంతుడికి అర్పించుట.. ఇదే అఖండ సినిమా.

సినిమా గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆది దేవుడు ఆశీర్వాదం ఉంది. భారతదేశంలో ఉన్న భక్తిని.. అఖండ సినిమాతో ఇంకా బతికిస్తునందుకు ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు మన కళ్ల ముందు కనిపించే దేవుళ్లు.. వాళ్లు దేవుళ్ల కన్నా ఎక్కువ. నేను ఎక్కువగా ప్రేమించేది నాన్న గారిని. ఆయన నాకు గురువు, దేవుడు. ఆ తర్వాత నేను ప్రేమించేది నా అభిమానులను. విజయాలకు గర్వపడటం.. అపజయాలకు కుంగిపోం. అభిమానుల ఆశీస్సుల పొందగలుగుతున్నామంటే అది పూర్వ జన్మ సుకృతం. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. శ్రీకాంత్ ‌కు హాట్సఫ్. నటన అంటే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం. నాకు అల్లు అర్జున్, శ్రీకాంత్‌ ఇద్దరు తమ్ముళ్ల లాంటి వారని, వారిని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది.

కరోనా కాలంలో కూడా ప్రాణాలను తెగించి షూటింగ్‌లు చేశాం. చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప’, రాజమౌళి గారి రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’, చిరంజీవి గారు నటించిన ‘ఆచార్య’ సినిమాలు విడుదలకి సిద్దమవుతున్నాయి. అన్ని సినిమాలు బాగా ఆడాలి. రెండు ప్రభుత్వాలు కూడా సినిమా ఇండస్టృఈకి పూర్తిగా సహకరించాలి. మలయాళంలో బన్నీకి చాక్లెట్ బాయ్ అని పేరిచ్చారు. సినిమాకు భాష బేధం లేదు. మంచి సినిమాలు అందిస్తున్నందుకు మనం గర్వపడాలి. అభిమానులు క్షేమంగా ఇళ్లకు చేరండి. ప్రజా సేవ చేస్తున్న నా అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉంటుందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు