డ్రీమ్ గర్ల్ కు థ్రిల్లింగ్ గిఫ్ట్ ఇచ్చిన బాలకృష్ణ
Published on Sep 3, 2016 11:11 am IST

balakrishna-hema-malini
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో బాలకృష్ణతో పాటు బాలీవుడ్ నటి, డ్రీమ్ గర్ల్ హేమమాలిని కూడా పాల్గొంటోంది. ఈ చిత్రంలో ఈమె బాలకృష్ణకు తల్లిగా నటిస్తోంది. మొదటిరోజు షూటింగ్ లో ఉండగా బాలకృష్ణ తన నియోజకవర్గమైన హిందూపూర్ లో ప్రసిద్ధి చెందిన లేపాక్షి చీరను ఆమెకు బహుమతిగా ఇచ్చాడట. దాంతో ఆమె థ్రిల్ ఫీలైందట.

హేమమాలిని దాదాపు 5 దశాబ్దాల తరువాత తెలుగు చిత్రంలో నటిస్తోంది. 1965 లో పాండవ వనవాసం, 1971 లో శ్రీకృష్ణ విజయం వంటి పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ తో కలిసి నటించింది. ఇన్నేళ్ల తరువాత మళ్ళీ తెలుగులో నటిస్తుండటం, బాలకృష్ణ ఊహించని బహుమతి ఇవ్వడంతో ఆమె తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారట. ఇకపోతే దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నాడు.

 
Like us on Facebook