క్లాస్ లుక్ తో థ్రిల్ చేసిన బాలయ్య !
Published on Nov 1, 2017 5:14 pm IST

నందమూరి బాలకృష్ణ 102 వ సినిమా ‘జై సింహ’ కు సంబందించిన ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఇందులో బాలయ్య ఊహించని రీతిలో చాలా క్లాస్ గా కనిపిస్తూ మెస్మరైజ్ చేశారు. సినిమా ప్రారంభోత్సవం రోజున జరిగే పూజా కార్యక్రమం నుండి నిన్నటి వరకు బయటికొచ్చిన లొకేషన్స్ స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్ అన్నిటిలోను ఆయన ఫుల్ మాస్ తరహాలో కనిపించడంతో సినిమా మొత్తం అదే అలాగే రఫ్ గా కనిపిస్తారని అందరూ ఊహించారు.

కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ లో మాత్రం క్లీన్ షేవ్ చేసి చాలా క్లాసీగా కనిపిస్తున్నారాయన. దేన్నీ చూస్తుంటే సినిమాలో ఏదో గతి విశేషమున్నట్టే అనిపిస్తోంది. అంతేగాక పోస్టర్ లో వెనకాల ఎన్టీఆర్ విగ్రహం ఉండటం చూస్తే సినిమాలో అభిమానులకు కావాల్సిన ఎమోషనల్ అంశాలు దండిగానే ఉన్నాయనిపిస్తోంది. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook