మహానటుడు, నటరత్న ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో, అంత గొప్ప దర్శకుడు కూడా. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రాల్లో ‘శ్రీకృష్ణపాండవీయం’ ఒకటి. ఇందులో ఎన్టీఆర్ తెచ్చిన సుయోధనుని పాత్రలో కనిపించారు. ఆ పాత్ర ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతలను తెచ్చి పెట్టింది. ఎన్టీఆర్ తన చేతిని సింహం తలమీద పెట్టి పౌరుషంగా కూర్చున్న పై స్టిల్ ‘శ్రీకృష్ణపాండవీయం’ చిత్రంలోనిదే. 1966లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు మంత్రం ముగ్దులయ్యారు. ఈ చిత్రం తర్వాతే ఎన్టీఆర్ ను ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ అని పిలవడం మొదలైంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన తనయడు నందమూరి బాలకృష్ణ, క్రిష్ దర్శకత్వలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ లో కూడా ఈ ‘శ్రీకృష్ణపాండవీయం’ చిత్రం గురించి ప్రస్తావన ఉంటుందట.ఎన్టీఆర్ పోషించిన సుయోధనుని పాత్రను బయోపిక్ లో బాలయ్య కొన్ని క్షణాలు పాటు పోషించనున్నారని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ అద్భుతంగా పండించిన ఆ పాత్రను బాలయ్య ఏ స్థాయిలో పండిస్తారో చూడాలి.
