టర్కీకి వెళ్లనున్న బాలకృష్ణ…అసలు కారణం ఇదే!

టర్కీకి వెళ్లనున్న బాలకృష్ణ…అసలు కారణం ఇదే!

Published on Aug 15, 2022 7:00 PM IST

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక చిత్రం, అనిల్ రావిపూడి దర్శకత్వం లో మరొక చిత్రం చేస్తున్నారు బాలయ్య. అయితే ఈ రెండు చిత్రాల పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటు క్రాక్ చిత్రం తో టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని, బాలయ్య తో అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, టీమ్ ఈ నెల 25న టర్కీకి వెళ్లనుంది. అక్కడ స్పెషల్ షెడ్యూల్ ప్లాన్ చేసింది యూనిట్. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు