పోయిన ఏడాది చిరుతో.. ఈ ఏడాది పవన్ తో బాలయ్య పోటీ !

9th, January 2018 - 05:27:59 PM

తెలుగు పరిశ్రమకు సంక్రాంతి సీజన్ ఎంతో ముఖ్యమైంది. ఈ సీజన్లో ఎన్ని సినిమాలు వచ్చినా బాగుంటే ప్రేక్షకుల ఆధరణ తప్పకుండా దొరుకుతుంది. అందుకే స్టార్ హీరోల నుండి అందరూ ఈ సీజన్లో తమ సినిమాను విడుదలచేయాలని ట్రై చేస్తుంటారు. ఈ సంవత్సరం నాలుగు సినిమాలు పండుగ బరిలో నిలిచాయి. వాటిలో పవన్ ‘అజ్ఞాతవాసి’, బాలయ్య ‘జై సింహ’ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ విశేషమేమిటంటే బాలక్రిష్ణ ఈ సంవత్సరం ఎలాగైతే పవన్ తో పోటీకి దిగారో గతేడాది కూడా చిరంజీవితో పోటీపడ్డారు

గతేడాది 2017 జనవరి 11న చిరు ‘ఖైదీ నెం 150’ విడుదలకాగా బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జనవరి 12న రిలీజై పోటాపోటీగా విజయాన్ని అందుకుంది. ఇప్పుడు కూడా అదే సక్సెస్ ను రిపీట్ చేసి సంక్రాంతి విజయంలో పాలుపంచుకునేందుకు జనవరి 10న ‘అజ్ఞాతవాసి’ దిగుతుంటే జనవరి 12వ తేదీనే ‘జై సింహ’ తో బరిలోకి దిగుతున్నారు నట సింహం. కనుక గతేడాది చిరుతో కలిసి ఎలాగైతే సక్సెస్ ను షేర్ చేసుకున్నారో ఈ 2018 లో కూడా బాలయ్య పవన్ తో కలిసి సంక్రాంతి విజయాన్ని సమపాళ్లలో పంచుకోవాలని ఆశిద్దాం.