సెంటిమెంట్ ప్రకారం బాలయ్య సినిమాకు అన్నీ కలిసొస్తున్నాయ్ !
Published on Jul 23, 2017 1:35 pm IST


నందమూరి బాలకృష్ణకు కొంచెం సెంటిమెంట్ నమ్మకాలు ఎక్కువే. తాను నమ్మిన సెంటిమెంట్లను వీలైనంత వరకు ఫాలో అవ్వాలని చూస్తుంటారాయన. కావాలని సెట్ చేసుకున్నారో లేకపోతే వాటికవే కుదిరిపోయాయో తెలీదు కానీ త్వరలో ప్రారంభంకానున్న ఆయన 102వ సినిమాలో కూడా సెంటిమెంట్ పద్దతి ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేశారు. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘సింహ’ భారీ విజయంగా నిలవగా ‘శ్రీరామరాజ్యం’ మంచి పేరు తెచ్చుకుంది.

దీంతో వీరిద్దరూ మూడోసారి జోడీకడుతున్న ఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక మరో సెంటిమెంట్ విషయానికొస్తే బాలయ్య 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కి మ్యూజిక్ అందించిన చిరంతన్ భట్ ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాడు. కాబట్టి దీన్ని రెండవ సెంటిమెంట్ గా చూస్తున్నారు. ఇలా సెంటిమెంట్ ప్రకారం అన్నీ కలిసొస్తున్న ఈ సినిమా తప్పక విజయం సాదిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇకపోతే సి. కళ్యాణ్ నిర్మాణంలో కె.ఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 3న రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించి 30 రోజుల పాటు షూటింగ్ జరపనున్నారు.

 
Like us on Facebook