బిగ్ బాస్ కి హోస్ట్ గా బాలయ్య?

బిగ్ బాస్ కి హోస్ట్ గా బాలయ్య?

Published on Dec 22, 2022 8:00 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్నారు. మరొక పక్క ఆహా వీడియో ఓటిటి షో అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే సీజన్ 2 తో ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ బిగ్ బాస్ తెలుగు హోస్ట్‌గా మారనున్నారు. చాలా సంవత్సరాలుగా షోను నిరంతరం హోస్ట్ చేసిన నాగార్జున ఈసారి బిగ్ బాస్ నుండి నిష్క్రమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

బిగ్ బాస్ రాబోయే సీజన్‌కి హోస్ట్‌గా నాగార్జున స్థానంలో బాలకృష్ణ వచ్చే అవకాశం ఉందని తాజా అప్డేట్‌లు సూచిస్తున్నాయి. అయితే తెలుగు బిగ్ బాస్ తదుపరి సీజన్ ఇంకా చాలా దూరంలో ఉంది. మరి అసలు నాగ్ స్థానంలో బాలకృష్ణ వస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం బాలకృష్ణ తన నెక్స్ట్ మూవీ వీరసింహరెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు