
ఈ సంవత్సరం ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా సత్యదేవ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్ నటించనున్నారు. అందులో ఇప్పటికే త్రిష ఒక హీరోయిన్ గా ఎంపికైంది. కానీ సెకండ్ హీరోయిన్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.
కొద్ది రోజుల క్రితం ‘లెజెండ్’ లో బాలయ్య సరసన కనిపించి మార్కులు కొట్టేసిన రాధిక ఆప్టేని సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ప్రొడక్షన్ టీం ఉందనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపించాయి. కానీ తాజాగా ‘అత్తారింటికి దారేది’ సినిమాతో తెలుగులో ఫేమస్ అయిన ప్రణిత పేరు వినిపిస్తోంది. రాధిక ఆప్టే ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ చిత్ర టీం ప్రణితపై ఆసక్తి చూపడమే కాకుండా, ఇప్పటికే ఆమెని కలిసి కథ వినిపించారని సమాచారం. మరి కొద్ది కొద్ది రోజుల్లో బాలకృష్ణ సరసన నటించబోయే సెకండ్ హీరోయిన్ ఎవరనేది అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.
షూటింగ్ లో గాయపడి కొద్ది రోజులు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన బాలకృష్ణ ఇటీవలే తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.