బాలయ్యతో పరుశురామ్ సినిమా.. నిజమేనా ?

Published on Feb 2, 2022 2:00 am IST

డైరెక్టర్ పరుశురామ్ బాలయ్యతో సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా వస్తోంది. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రిలీజ్ తర్వాత.. పరశురామ్ బాలయ్యతో సినిమా చేస్తాడట. పరశురామ్ గతంలోనే బాలయ్యకి ఓ కథ చెప్పాడని, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఈ కాంబినేషన్ నిజం అయితే మాత్రం మంచి ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. పైగా ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత సినిమా కాబట్టి.. ఈ సినిమాఅక్ పై భారీ అంచనాలు ఉంటాయి. మరి బాలయ్య కోసం పరుశురామ్ ఎలాంటి కథ రాశాడో చూడాలి. అలాగే వీరి కలయికలో వచ్చే సినిమా ఏ జోనర్ లో రానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :