బాలకృష్ణకు మరో సర్జరీ.. అసలు ఏమయ్యిందంటే..!

Published on Apr 26, 2022 3:00 am IST


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే బాలయ్య భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అఖండ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక చిన్న ప్రమాదంలో ఆయన కుడిభుజంకు గాయం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్‌లో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. ఇక తాజాగా మరోసారి బాలయ్యకు శస్త్ర చికిత్స నిర్వహించారు వైద్యులు.

గత కొన్నిరోజుల నుంచి బాలకృష్ణ మోకాలి నొప్పితో బాధపడుతున్నారని, దీంతో మరోసారి వైద్యులు ఆయనకు మోకాళ్ల నొప్పికి శస్త్రచికిత్స చేశారు. బాలకృష్ణ కు జరిగింది మైనర్ సర్జరీనేనని, ఆయన ఆరోగ్యం పూర్తిగా బావుందని, కొద్దిరోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో వైద్యులతో పాటు బాలయ్య కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో బాలయ్య అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

సంబంధిత సమాచారం :