బాలయ్య షోకు డైలాగ్ కింగ్ ఫ్యామిలీ.. పిక్స్ వైరల్..!

Published on Oct 31, 2021 1:16 am IST


నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ నిర్మాణంలో నవంబర్ 4వ తేది నుంచి ప్రసారం కానున్న ఈ షో మొత్తం 12 ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ షో లోకి ప్రత్యేక గెస్ట్ లుగా సినీ పరిశ్రమకి చెందిన వారు రానున్నారు.

ఇటీవల ఈ టాక్ షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో బాలయ్య స్టన్నింగ్ లుక్స్‌, స్టైల్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ షో మొదటి ఎపిసోడ్‌కు డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు, కూతురు మంచు లక్ష్మీ పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రేపు తొలి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :