నేను సీరియల్‌ని కాదు.. “సెలబ్రేషన్” అంటూ బాలయ్య బ్యాక్..!

Published on Nov 29, 2021 10:40 pm IST


నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో వస్తున్న ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలయ్య డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబుతో, నేచురల్ స్టార్ నానితో రెండు ఎపిసోడ్‌లను పూర్తి చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. అయితే ఇటీవల బాలయ్య ఎడమచేతికి సర్జరీ జరగడం, అఖండ ప్రమోషన్స్ కారణంగా ఈ షోను కొద్దిరోజులు వాయిదా వేశారు. మొన్న జరిగిన ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఆయన చేతికట్టుతోనే కనిపించారు.

అయితే తాజాగా ఎనర్జీ ఈజ్ బ్యాక్ అంటూ బాలయ్య కొత్త ఎపిసోడ్ ప్రోమోను ఆహా నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఇందులో కూడా బాలయ్య చేతికట్టుతోనే దర్శనమిచ్చారు. మూడు వారాలు గ్యాప్ వచ్చింది.. అందరు ఒకటే ఫోన్లు, మెసేజ్‌లు.. నేను ఎలా ఉన్నానని కాదు.. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అని.. అంటూ వారం.. వారం రావడానికి నేను సీరియల్‌ని కాదు.. సెలబ్రేషన్ అంటూ బాలయ్య తనదైన స్టైల్‌లో రచ్చ చేశాడు. అయితే ఈ ఎపిసోడ్‌కి ఎవరు గెస్ట్‌గా రాబోతున్నారన్న ప్రోమోను త్వరలోనే విడుదల చేస్తున్నట్టు ఆహా తెలిపింది.

సంబంధిత సమాచారం :