“అన్ స్టాపబుల్”.. ఒక్కో ఎపిసోడ్‌కి బాలయ్య పారితోషికం ఎంతంటే?

Published on Oct 16, 2021 11:07 pm IST

తనదైన నటనతో, డైలాగులతో వెండి తెరపై ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను మెప్పించేందుకు కూడా సిద్దమయ్యాడు. అల్లు అరవింద్ నిర్మాణంలో నవంబర్ 4వ తేది నుంచి ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటీవలే భారీ లాంచింగ్ కార్యక్రమం కూడా జరిగింది. ఈ షో మొత్తం 12 ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ కానుంది.

అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం బాలకృష్ణ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్నది అభిమానులతో పాటు ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఒక్కో ఎపిసోడ్‌కు బాలయ్య బాబు రూ.40 లక్షలు తీసుకుంటునట్టు తెలుస్తుంది. బాలకృష్ణకు ఉన్న ఇమేజ్, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్ భారీగానే ముట్టచెబుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More