ఓటీటీలో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన బాలయ్య షో..!

Published on Dec 2, 2021 12:00 am IST


నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో వస్తున్న ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలయ్య డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబుతో, నేచురల్ స్టార్ నానితో రెండు ఎపిసోడ్‌లను పూర్తి చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. అయితే ఇటీవల బాలయ్య ఎడమచేతికి సర్జరీ జరగడం, అఖండ ప్రమోషన్స్ కారణంగా ఈ షోను కొద్దిరోజులు వాయిదా వేశారు.

అయితే ఇటీవల ఎనర్జీ ఈజ్ బ్యాక్ అంటూ బాలయ్య కొత్త ఎపిసోడ్ ప్రోమోను కూడా ఆహా నిర్వాహకులు రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడా, ఆ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా ఎవరొస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది పక్కన పడితే బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షో సరికొత్త రికార్డ్‌ను సెట్ చేసింది. ఓటీటీ ప్లాట్‌పాంలో ఏకంగా 4 మిలియన్లకు పైగా వీడియో ప్లేలతో రికార్డు సృష్టించింది. ఏది ఏమైనా బాలయ్య దిగాడంటే రికార్డ్స్ తిరగడిపోవాల్సిందే అని ప్రూవ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :