మరొక ఆసక్తికరమైన పాత్రలో కనిపిస్తానంటున్న బాలయ్య !

19th, January 2018 - 01:03:30 PM


పౌరాణిక, చారిత్రిక పాత్రలంటే ఎక్కువగా ఇష్టపడే నందమూరి బాలక్రిష్ణ ఇప్పటికే శ్రీ కృష్ణ దేవరాయ, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి మహోన్నత వ్యక్తుల పాత్రల్లో నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన ఇదే తరహాలో హిందూ వేదాంతి ‘రామానుజాచార్య’ పాత్రలో నటించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్న ఆయన ఇంకొన్నాళ్ల తర్వాత ‘రామానుజాచార్య’ సినిమాను చేస్తానని, గొప్ప వ్యక్తుల పాత్రలను చేయడమంటే మొదటి నుండి తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇకపోతే ‘ఎన్టీఆర్’ సినిమా రెగ్యులర్ షూట్ మార్చి నెల నుండి మొదలుకానుంది.