సీనియర్ దర్శకుడితో సినిమా చేసే ఆలోచనలో బాలయ్య ?
Published on Nov 6, 2017 1:34 pm IST

ప్రస్తుతం కెఎస్.రవికుమార్ డైరెక్షన్లో ‘జై సింహా’ సినిమా చేస్తున్నారు బాలక్రిష్ణ. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తరవాత తేజ డైరెక్షన్లో బయోపిక్ ‘ఎన్టీఆర్’ ను చేయాలని అనుకున్నారాయన. కానీ తేజ డిసెంబర్ 13 నుండి వెంకటేష్ తో ఒక సినిమా మొదలుపెట్టనున్నాడు. అది పూర్తయ్యాకే ‘ఎన్టీఆర్’ సినిమాను చేస్తాడు. కాబట్టి ‘ఎన్టీఆర్’ మొదలవడానికి కాస్త సమయం పడుతుందని స్పష్టమైంది.

దీంతో బాలక్రిష్ణ ఈ గ్యాప్ లో మరొక సినిమా చేయాలని అనుకుంటున్నారట. అది కూడా సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డితో కావడం విశేషం. కృష్ణారెడ్డిగారు చెప్పిన ఒక స్టోరీ లైన్ నచ్చడంతో దాంతోనే సినిమా చేయాలని బాలయ్య భావిస్తున్నారని వినికిడి. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే బాలక్రిష్ణ లేదా కృష్ణారెడ్డిగారి నుండి క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. గతంలో వీరిద్దరి కలయికలో ‘టాప్ హీరో’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

 
Like us on Facebook