తేజాకి డెడ్ లైన్ ఫిక్స్ చేసిన బాలయ్య !

17th, October 2017 - 08:33:28 AM


స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి జీవితాన్ని తెరకెక్కించే పనిని బాలక్రిష్ణ దర్శకుడు తేజాకు అప్పగించిన సంగతి తెలియసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ఆరంభం కానుంది. సినిమాని ఒకసారి మొదలుపెడితే పూర్తిచేసేవరకు వెనక్కు తగ్గని లక్షణమున్నందుకే బాలయ్య తేజాను చూజ్ చేసుకున్నారు. ప్రాజెక్ట్ తో పాటే తేజపై మరో పెద్ద భాద్యతను కూడా పెట్టారట బాలక్రిష్ణ.

అదేమిటంటే ఈ బయోపిక్ ను ఎట్టి పరిస్థితుల్లో వచ్చేఏడాది ఎన్టీఆర్ జయంతి అయిన మే 28 నాటికీ రిలీజ్ చేయాలని డెడ్ లైన్ పెట్టారట బాలక్రిష్ణ. తేజా కూడా అందుకు తగ్గట్టే వర్క్ చేస్తున్నారు. మరి బాలక్రిష్ణ పెట్టిన డెడ్ లైన్ లోపల తేజా సినిమాను పూర్తి చేస్తారో లేదో చూడాలి. బాలక్రిష్ణ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయనే ఎన్టీఆర్ పాత్రలో కనిపించనుండటం విశేషం.