‘బింబిసార’ స్పెషల్ షో చూసిన బాలకృష్ణ ఏమన్నారంటే… ?

‘బింబిసార’ స్పెషల్ షో చూసిన బాలకృష్ణ ఏమన్నారంటే… ?

Published on Aug 13, 2022 11:00 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా యాక్షన్ కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ మూవీలో క్యాథరీన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించగా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దీనిని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె హరికృష్ణ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీని నేడు యూనిట్ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు నందమూరి బాలకృష్ణ.

ఇక ఈ మూవీ చూసిన అనంతరం టీమ్ ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కళ్యాణ్ రామ్ బింబిసార పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించారని, అలానే దర్శకుడు వశిష్ట అనుభవమున్న దర్శకుడు మాదిరిగా ఎంతో అద్భుతంగా మూవీని తెరకెక్కించారని, ఇంతటి ఘన విజయం అందుకున్న బింబిసార యూనిట్ మొత్తానికి తన తరపున ప్రత్యేకంగా అభినందలు తెలియచేసారు బాలకృష్ణ. కాగా ఆయన బింబిసార స్పెషల్ షో చూసిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు