ఫ్యామిలీతో కలిసి “పుష్ప” మూవీని వీక్షించిన బాలకృష్ణ..!

Published on Dec 31, 2021 12:04 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కిన “పుష్ప” చిత్రం డిసెంబర్ 17న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. తాజాగా నందమూరి బాలకృష్ణ కుటుంబంతో సహా పుష్ప సినిమాను వీక్షించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు బాలయ్య కోసం ప్రసాద్ ల్యాబ్‌లో స్పెషల్ స్క్రీనింగ్ ని వేయించారు.

అయితే బాలకృష్ణతో పాటు ఆయన సోదరి పురందేశ్వరి, బాలకృష్ణ భార్య వసుంధర, మోక్షజ్ఞ, చిన్న కూతురు తేజస్విని, ఆమె భర్త కూడా పుష్ప సినిమాను వీక్షించారు. అనంతరం చిత్ర నిర్మాతల్లో ఒకరైన యర్నేని నవీన్‌తో కాసేపు మాట్లాడిన బాలకృష్ణ ‘పుష్ప’ సినిమా బావుందని చెప్పినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పుష్ప పార్ట్‌ 2 షూటింగ్‌ వచ్చే ఏడాది ప్రారంభంకానుంది.

సంబంధిత సమాచారం :