నందమూరి బాలకృష్ణ కుడి భుజం కి ఆపరేషన్!

Published on Nov 2, 2021 6:21 pm IST


ప్రముఖ టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కి ఆపరేషన్ అయినట్లు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా బాలకృష్ణ కుడి భుజం నొప్పితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఆపరేషన్ జరిగింది.

నిన్న కేర్ ఆసుపత్రి లో డాక్టర్ రఘు వీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది. ఈరోజు బాలకృష్ణ డిశ్చార్జ్ కానున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం అని వైద్య బృందం తెలిపింది. బాలకృష్ణ అఖండ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అదే విధంగా ఆహా వీడియో కోసం అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More