సెన్సేషన్ అప్డేట్: బసవతారకరామ ప్రొడక్షన్ నంబర్ వన్ ను అనౌన్స్ చేయనున్న బాలయ్య!

Published on May 26, 2022 7:35 pm IST

మే 28 కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భం గా పలు కార్యక్రమాలు, నందమూరి హీరోల చిత్రాలకు సంబందించిన అప్డేట్ లు రానున్నాయి. అయితే ఇప్పుడు మరొక సెన్సేషన్ అప్డేట్ కి రంగం సిద్ధం అయ్యింది. బసవతారకరామ క్రియేషన్స్ తమ మొదటి ప్రొడక్షన్ ను అనౌన్స్ చేయనుంది. ఈ ప్రకటన ను నందమూరి బాలకృష్ణ మే 28, 2022 న ప్రకటించనున్నట్లు తాజాగా ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది.

ఈ ప్రొడక్షన్ నంబర్ వన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎలాంటి అనౌన్స్ మెంట్ వస్తుందని ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మాసివ్ అనౌన్స్ మెంట్ పై సినీ పరిశ్రమ సైతం ఆసక్తి గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అఖండ చిత్రం విజయం తో దూసుకు పోతున్నారు.

సంబంధిత సమాచారం :