బాలయ్య ‘అఖండ’కి కొత్త రిలీజ్ డేట్ !

బాలయ్య ‘అఖండ’కి కొత్త రిలీజ్ డేట్ !

Published on Nov 1, 2021 2:22 PM IST

నటసింహం బాలయ్య – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘అఖండ’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే, ఈ సినిమా కోసం కొత్త విడుదల తేదీని మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 2న ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

అందుకే త్వరలోనే ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టనున్నారు. అలాగే మరో వారం రోజుల్లో రిలీజ్ డేట్ ఎనౌన్స్‌మెంట్ పోస్టర్‌ ను కూడా విడుదల చేస్తారట. ఇక ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్‌ గా ఉంటాయట. పైగా బోయపాటి అంటేనే యాక్షన్. అన్నిటికీ మించి గతంలో బాలయ్యతో చేసిన సింహా, లెజెండ్ సినిమాలు బారీ విజయాలు సాధించాయి.

మరి ఇప్పుడు చేస్తోన్న ఈ సినిమా కూడా హ్యాట్రిక్ అవుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా పై బాలయ్య ఫ్యాన్స్ బాగా హోప్స్ పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు