అన్‌స్టాపబుల్: బాలయ్య ఇమేజ్ బాగానే పెరిగిందిగా..!

Published on Dec 21, 2021 2:35 am IST


నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా బాలయ్య తనదైన మ్యానరిజంతో విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. బాలకృష్ణ ఏంటి హోస్టింగ్ ఏంటి అని, ఆయన మాట్లాడడానికి తడబడుతాడని అనుకునే వారి అభిప్రాయం ఈ షో వల్ల మారిపోయింది.

చాలా కూల్‌గా ఎటువంటి తడబాటు లేకుండా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న విధానం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఈ షో వల్ల ఆయనకు ఉన్న క్రేజ్ కూడా పెరిగింది. ఆర్థిక రూపంలో మాత్రమే కాకుండా ఇమేజ్ పరంగా కూడా బాలయ్యకి ఈ షో ఎంతో లాభం చేకూర్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య హోస్టింగ్ చేస్తున్న ఈ షో వల్ల ఆహాకు చాలా సబ్స్క్రిప్షన్లు పెరిగినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :