‘జై బాలయ్య’నే బాగుందంటున్న బాలయ్య ఫ్యాన్స్ !

‘జై బాలయ్య’నే బాగుందంటున్న బాలయ్య ఫ్యాన్స్ !

Published on May 31, 2022 2:00 AM IST

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. కాగా ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో రోజుకొక పుకారు వినిపిస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యిందని.. ‘జై బాలయ్య ‘ అనే టైటిల్ నే మేకర్స్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. జై బాలయ్య అనే పదమే చాలా క్యాచీగా చాలా బాగుందని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న ఈ సినిమాతో.. ఇక గోపిచంద్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

కాగా రామ్ – లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు