‘అన్నగారు’ కాదు, బాలయ్య.. ‘జై బాలయ్య’కే ఫిక్స్ !

‘అన్నగారు’ కాదు, బాలయ్య.. ‘జై బాలయ్య’కే ఫిక్స్ !

Published on May 26, 2022 4:00 PM IST

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. కాగా ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పటికే చాలా రూమర్లు వినిపించాయి. ముఖ్యంగా ఈ సినిమాకి టైటిల్ ‘అన్నగారు’ అని టైటిల్ పెట్టినట్టు టాక్ నడిచింది. ఐతే, ఈ రూమర్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ‘జై బాలయ్య’ అని తెలుస్తోంది. ఈ టైటిల్ నే చిత్రబృందం ఫైనల్ చేసిందట.

కాగా రామ్ – లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి గోపిచంద్ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు