బాలయ్య సిమిమా పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

బాలయ్య సిమిమా పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Oct 3, 2022 7:08 PM IST


నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇంటర్వెల్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఇంటర్వెల్ దగ్గరే బాలయ్య క్యారెక్టర్ కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుందని.. సినిమా మొత్తంలోనే ఈ ట్విస్ట్ మెయిన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది.

థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న ఈ సినిమాతో.. ఇక గోపిచంద్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు