ప్రశాంత్ వర్మ కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ?

ప్రశాంత్ వర్మ కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ?

Published on Oct 30, 2022 10:58 PM IST


నిర్మాత ‘డి.వి.వి దానయ్య’ త్వరలో బాలయ్య బాబుతో ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాడని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ఫిల్మ్ సర్కిల్స్‌లో గాసిప్ వినిపిస్తోంది. పైగా ఈ చిత్రానికి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడట. కానీ తాజాగా ప్రశాంత్ వర్మ బాలయ్యకి కథ చెప్పాడని.. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఐతే, ఈ వార్త ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

ఎలాగూ ఇప్పటికే ప్రశాంత్ వర్మ బాలయ్య అన్‌స్టాపబుల్ 2 టీజర్ కి దర్శకత్వం వహించాడు. టీజర్ లో బాలకృష్ణను చాలా బాగా చూపించాడు. అందుకే, బాలయ్య కూడా ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. మరోపక్క బాలయ్య, దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి సన్నద్ధం అయ్యాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు