అతిధి పాత్రలో బాలయ్య వారసుడు ?

Published on May 1, 2023 10:01 am IST

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య బాలకృష్ణ కూడా.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని ప్రకటించారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది బాలయ్య అప్పుడు ప్రకటించలేదు. ఇప్పుడు ఆ దర్శకుడి పై ఒక కొత్త రూమర్ వినిపిస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్ నడుస్తోంది. బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు లోపు ఈ సినిమాని బోయపాటి శ్రీను ఫినిష్ చేస్తాడట.

కాగా అక్టోబర్ తర్వాత నుంచి బాలయ్యతో బోయపాటి శ్రీను మరో సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలోనే మోక్షజ్ఞ కూడా నటిస్తున్నాడని.. మోక్షజ్ఞ క్యారెక్టర్ ప్లాష్ బ్యాక్ లో వస్తోంది అని తెలుస్తోంది. అయితే, ఈ వార్త పై ఇంతవరకు ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు. నిజానికి 2017లోనే తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత మోక్షజ్ఞకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం హీరో అయ్యే దిశగా మోక్షజ్ఞ కసరత్తులు చేస్తున్నాడట. ముందుగా అతిధి పాత్రలో నటించి.. ఆ తర్వాత సోలో హీరోగా సినిమా చేస్తాడట.

సంబంధిత సమాచారం :