నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఆ డైరెక్టర్ తోనే ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఆ డైరెక్టర్ తోనే ?

Published on Jan 9, 2023 11:13 PM IST

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న బాలకృష్ణ.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని ప్రకటించారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య ప్రకటించలేదు. ఇప్పుడు ఈ దర్శకుడి పై ఒక రూమర్ వినిపిస్తోంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్ నడుస్తోంది. బోయపాటి ప్రస్తుతం రామ్ తో సినిమా చేస్తున్నాడు.

కాగా ఈ ఏడాది సమ్మర్ కల్లా రామ్ సినిమాని బోయపాటి ఫినిష్ చేస్తాడట. సమ్మర్ తర్వాత నుంచి మోక్షజ్ఞ సినిమా పై బోయపాటి కూర్చుంటాడట. అయితే, ఈ వార్త పై ఇంతవరకు ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు. నిజానికి 2017లోనే తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత మోక్షజ్ఞకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం హీరో అయ్యే దిశగా మోక్షు కసరత్తులు చేస్తున్నాడు. కాబట్టి.. ఈ ఏడాది ఎంట్రీ ఉండొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు