త్రివిక్రమ్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ.. నిజమేనా ?

త్రివిక్రమ్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ.. నిజమేనా ?

Published on Nov 27, 2022 6:22 PM IST

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న బాలకృష్ణ.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు. తన కుమారుడిని వచ్చే ఏడాది టాలీవుడ్‌లోకి పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య ప్రకటించలేదు .ఇప్పుడు ఈ దర్శకుడి పై ఒక రూమర్ వినిపిస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్ నడుస్తోంది. మహేష్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కల్లా త్రివిక్రమ్ ఫినిష్ చేస్తాడట.

సమ్మర్ తర్వాత నుంచి మోక్షజ్ఞ సినిమా పై త్రివిక్రమ్ కూర్చుంటాడట. అయితే, ఈ వార్త పై ఇంతవరకు ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు. నిజానికి 2017లోనే తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత మోక్షజ్ఞకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం హీరో అయ్యే దిశగా మోక్షు కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తోంది. ఓ దశలో అయితే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్ అని కూడా ప్రచారం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు