తమిళంలో రిలీజ్ కానున్న బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం !
Published on May 24, 2017 1:45 pm IST


నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రంగా చేసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లో కలెక్షన్ల పరంగా ఒక మైలురాయిగా నిలిచిపోయింది. చారిత్రిక నైపథ్యం కలిగిన ఈ సినిమాని ఇప్పుడు తమిళంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

తెలుగు చిత్రమైన ‘బాహుబలి- ది కంక్లూజన్’ చిత్రం తమిళంలో సాధించిన విజయంతో తమిళ ప్రేక్షకులకు తెలుగు పిరియాడికల్ సినిమాలపై మక్కువ ఎక్కువైంది. ఆ అంశాన్ని గమనించిన డిస్ట్రిబ్యూటర్లు కొందరు శాతకర్ణిని తమిళంలోకి డబ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. సుమారు 200లకు పైగా స్క్రీన్లలో ఈ చిత్రం రిలీజవుతుందని సమాచారం. అయితే ఎప్పుడు రిలీజవుతుంది, ఎవరు రిలీజ్ చేస్తారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook