బాలయ్య “వీరసింహారెడ్డి” రన్‌టైమ్ లాక్డ్!

బాలయ్య “వీరసింహారెడ్డి” రన్‌టైమ్ లాక్డ్!

Published on Dec 13, 2022 2:00 PM IST

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా వీరసింహారెడ్డి. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమా రన్‌టైమ్ రెండు గంటల నలభై మూడు నిమిషాలకు లాక్ అయిందని తెలుస్తోంది.

ఫ్యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించగా, రెండో సింగిల్ త్వరలో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు