బాలయ్య “వీరసింహారెడ్డి” కి బుల్లితెర పై వచ్చిన రెస్పాన్స్ ఇదే!

Published on May 5, 2023 6:25 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో ప్రసారం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా విడుదల అయ్యింది.

ఈ చిత్రానికి 8.8 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ మేరకు ఇది చాలా బెటర్ అని చెప్పాలి. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :