బాలకృష్ణుడు సెన్సార్ డీటెయిల్స్ !
Published on Nov 21, 2017 2:53 pm IST

డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే హీరోల్లో ఒకరు నారా రోహిత్. శమంతకమణి కథలో రాజకుమారి సినిమాలతో ఈ మద్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ హీరో నటించిన తాజా చిత్రం ‘బాలకృష్ణుడు’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను సెన్సార్ బోర్డ్ యు/ఏ సర్టిఫికేట్ జారి చేసింది. 2:22 నిమిషాలు ఈ సినిమా రన్ టైం.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో రెజినా హీరోయిన్. ఈ సినిమా కథ రొటీన్ గా ఉన్నా కథనంలో కొత్తదనం ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రుద్వి, పోసాని, శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెడి ఈ సినిమాకు హైలెట్ కానుందని సమాచారం. దర్శకుడిగా పవన్ మల్లెల తీసిన మొదటి సినిమా ఇదే అవ్వడం విశేషం.

 
Like us on Facebook