ఇంట్రెస్టింగ్‌గా “బలమెవ్వడు” టీజర్..!

Published on Sep 18, 2021 2:21 am IST

ధృవన్ కటకం, నియా త్రిపాఠి జంటగా సత్య రాచకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “బలమెవ్వడు”. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్బీ మార్కండేయులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుహాసిని, నాజర్‌లు కీలక పాత్రలు పోశిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయ్యింది. టీజర్‌ను చూస్తుంటే లవ్ అండ్ మెడికల్ క్రైమ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. రిస్క్ తీసుకోకపోతే లైఫ్‌లో మిగిలేది రస్క్ మాత్రమే అన్న డైలాగ్ ఆకట్టుకుంది. కామెడీ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :