బాలయ్య 108 రిలీజ్ అయ్యేది ఆరోజునే ?

Published on Mar 30, 2023 6:59 am IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఒక భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర చేస్తోంది.

మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో బాలయ్య పవర్ఫుల్ రోల్ చేస్తుండగా బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా విషయం ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక మూవీని అక్టోబర్ 21న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. కాగా ఈ డేట్ ని త్వరలో మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట.

సంబంధిత సమాచారం :