టాక్..బాలయ్య 108 రాక దాదాపు అప్పటికే.!

Published on Mar 3, 2023 10:59 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడితో తన కెరీర్ లో 108వ సినిమా ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే. “అఖండ” మరియు “వీరసింహా రెడ్డి” లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అయితే బాలయ్య మళ్ళీ తన ఫామ్ లోకి రాగ అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ కి మరింత హైప్ నెలకొంది. మరి ఆల్రెడీ షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం బాలయ్య మరియు అనిల్ మార్క్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ అవుతుంది.

మరి మధ్యలో చిన్న డిలే లు ఉన్నప్పటికీ కూడా సినిమా షూటింగ్ అనుకున్న టైం కి కంప్లీట్ కానుందట. అందుకే ఈ సినిమా రిలీజ్ దాదాపు ఈ ఏడాది లోనే ఉంటుంది అని బజ్ వినిపిస్తుంది. కాగా ఈ భారీ సినిమా అయితే ఈ ఏడాది దసరా బరిలో నిలిచే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే బాలయ్య రాక ఆల్ మోస్ట్ అప్పటికే ఖరారు అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :