“అఖండ” నైజాం డే 1 వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయ్.!

Published on Dec 3, 2021 11:00 am IST

నందమూరి నటసింహం నందమూరి నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్సకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “అఖండ” నిన్ననే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ భారీ చిత్రం అంచనాలకి తగ్గట్టు గానే భారీ ఓపెనింగ్స్ ఈ చిత్రం అనుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు ఊహించినట్టుగా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నట్టు తెలుస్తుంది.

మరి ఈ క్రమంలో సినిమా నైజాం డే 1 వసూళ్ల వివరాలు బయటకి వచ్చాయి. ఈ చిత్రానికి అక్కడ మొదటి రోజు 4.37 కోట్ల రూపాయల షేర్ వచ్చిందట. ఈ సినిమా హైప్ కి తగ్గట్టుగానే ఈ షేర్ డీసెంట్ గా వచ్చిందని చెప్పాలి. అలాగే ఈ వీకెండ్ లో కూడా బాలయ్య అదిరే వసూళ్లు అందుకోవడం గ్యారెంటీ.. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :