యూఎస్ లో బ్రేక్స్ లేని బుల్ డోజర్ లా “అఖండ” వసూళ్లు.!

Published on Dec 5, 2021 2:00 pm IST

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ది మోస్ట్ వాంటెడ్ అండ్ టాకింగ్ సినిమా “అఖండ”. నందమూరి నటసింహం బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ హ్యాట్రిక్ సినిమా మొదటి రోజు నుంచే అంచనాలకు తగ్గట్టుగా సాలిడ్ టాక్ ని తెచ్చుకొని అదరగొట్టింది.

అయితే అనకాపల్లి అయినా అమెరికా అయినా కూడా బాలయ్య బాక్సాఫీస్ బాదుడు మాత్రం ఒకేలా ఫ్రీక్వెన్సీ లో ఉందని చెప్పాలి. ఆల్రెడీ యూఎస్ మార్కెట్ దగ్గర సాలిడ్ ప్రీమియర్స్ తో అదరగొట్టి స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. మరి ఇదిలా ఉండగా ఇపుడు ఈ చిత్రం 7 లక్షల డాలర్స్ మార్క్ క్రాస్ చేసి 1మిలియన్ వసూళ్లకి బ్రేక్స్ లేని బుల్ డోజర్ లా దూసుకెళ్తుంది.

దీనిని బట్టి ఓవర్సీస్ లో బాలయ్య అఖండ హవా ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :