నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “డాకు మహారాజ్” తో తన కెరీర్లో మరో సాలిడ్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం హిట్ కి ముందు బాలయ్య 2.0 కి పునాది వేసిన సెన్సేషనల్ హిట్ చిత్రం “అఖండ” అని చెప్పాలి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ భారీ సినిమా బాలయ్యకి నెక్స్ట్ లెవెల్ కం బ్యాక్ ఇవ్వడమే కాకుండా అక్కడ నుంచి వరుస హిట్స్ తో బాలయ్య ఫామ్ లోకి వచ్చేలా చేసింది.
ఇక ఇపుడు దీనికి సీక్వెల్ “అఖండ 2” తాండవంగా రాబోతుండగా దీనిపై భారీ హైప్ నెలకొంది. అయితే ఆ పార్ట్ 2 షూటింగ్ ని ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళాలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా నిజమైన కుంభమేళాలో స్టార్ట్ అయ్యిన ఈ సినిమాపై లేటెస్ట్ పార్ట్ 1 మాస్ క్రేజ్ కనిపిస్తుంది.
అక్కడ అఖండ బాలయ్య పెయింటింగ్ తో కూడిన వెస్ట్ బెంగాల్ బస్సులు దర్శనం ఇచ్చాయి. దీనితో ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి పార్ట్ 1 కి హిందీ ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. పార్ట్ 2 కూడా నార్త్ ఆడియెన్స్ లో ఓ రేంజ్ లో వర్క్ అవుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు.
West Bengal bus at kumbhamela????????
God of Masses NBK #Akhanda ????????#NandamuriBalakrishna #Akhanda2@14ReelsPlus pic.twitter.com/8I8CtQWXns
— manabalayya.com (@manabalayya) February 6, 2025