గ్రాండ్ గా లాంచ్ అయ్యిన బాలయ్య మాసివ్ ప్రాజెక్ట్.!

Published on Nov 13, 2021 2:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఆల్రెడీ నటించిన “అఖండ” పై ఆల్రెడీ భారీ అంచనాలు నెలకొనడం. ఈరోజు ఓ క్రేజీ అప్డేట్ కూడా వస్తుండడం ఒకెత్తు అయితే ఇదే రోజున బాలయ్య మాసివ్ ప్రాజెక్ట్ దర్శకుడు గోపిచంద్ మలినేని తో ప్లాన్ చేసింది గ్రాండ్ గా లాంచ్ అవ్వడం ఇంకో ఎత్తు. టాలీవుడ్ టాప్ దర్శకులు వివి వినాయక్, హరీష్ శంకర్, బాబీ, కొరటాల శివ ఇంకా లేటెస్ట్ ఉప్పెన హిట్ దర్శకుడు బుచ్చి బాబు సానా కూడా పాల్గొన్నారు. మరి బోయపాటి శ్రీను స్విచ్ ఆన్ చెయ్యగా ఫస్ట్ షాట్ ని హరీష్ శంకర్ క్లాప్ చేశారు.

ఇలా అంగరంగ వైభవంగా ఈ సినిమా లాంచ్ గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో హీరోయిన్ శృతిహాసన్ కూడా పాల్గొంది. అలాగే ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్న నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు గోపిచంద్ మరింత జాగ్రత్తలు వహించి బాలయ్య ని నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చెయ్యనున్నారట. ఇక ముందు ఈ భారీ సినిమాపై మరింత సమాచారం రానుంది.

సంబంధిత సమాచారం :